తమ్ముడి కోసం యువతిని కిడ్నాప్ చేసిన బుల్లితెర నటి అంజలి... పోలీసులకు ఫిర్యాదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమ్ముడి కోసం యువతిని కిడ్నాప్ చేసిన బుల్లితెర నటి అంజలి... పోలీసులకు ఫిర్యాదు!

  • ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు
  • కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వెంకటేశ్, దివ్య
  • వెంకటేశ్ సోదరి కిడ్నాప్ చేయించిందన్న దివ్య అమ్మ, నాన్న
హైదరాబాద్ పరిధిలోని బల్కంపేట ఆర్యసమాజ్ లో జరిగిన ఓ వివాహం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో వరుడి సోదరి, బుల్లితెర నటి అంజలిపై వధువు తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎస్సార్ నగర్ ప్రాంతానికి చెందిన టి వెంకటేశ్ (28), జి దివ్య (24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దివ్య తల్లిదండ్రులకు ఈ వివాహం ఎంతమాత్రమూ ఇష్టంలేదు. కుమార్తె ప్రేమ వివాహం తెలుసుకున్న తరువాత వారిని మందలించారు కూడా.

ఇక రెండు రోజుల క్రితం దివ్య ఇంటి నుంచి వెళ్లిపోగా, తన కుమార్తెను వెంకటేష్ సోదరి, నటి అంజలి కిడ్నాప్ చేసిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను తన సోదరుడు వెంకటేశ్ కు ఇచ్చి వివాహం చేయాలన్నది ఆమె ఆలోచనని ఆరోపించారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని వారు కోరారు. వారు కేసు పెట్టిన మరుసటి రోజే వెంకటేశ్, దివ్య ఆర్యసమాజ్ లో వివాహం చేసుకోవడం గమనార్హం.
Hyderabad
Police
Kidnap
Tv Artist
Anjali

More Telugu News