దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న గేల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న గేల్!

ఐపీఎల్ లో మెరుపువీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ క్రేజ్ కొనసాగుతున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని భావిస్తున్నాడు. తాజాగా గేల్ ఓ భారత రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ చురుగ్గా వ్యాపారం చేస్తోన్న అగ్రాణి హోమ్స్ కు గేల్ ఇకనుంచి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో అగ్రాణి హోమ్స్ సీఎండీ అలోక్ కుమార్ ప్రకటించారు.

తన నియామకంపై గేల్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ పై వ్యాఖ్యానించేందుకు గేల్ నిరాకరించాడు. కాగా, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో బీహార్ శాసనమండలి సభ్యుడు సంజయ్ సింగ్ కూడా భాగస్వామిగా ఉన్నారు. సంజయ్ సింగ్ జేడీ(యూ) పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.

More Telugu News