ఇక మాకు రాహుల్ వద్దు... ప్రియాంక కావాలి: స్వరం మార్చిన కాంగ్రెస్ క్యాంప్
- కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన రాహుల్
- కాంగ్రెస్ ఓడిపోవడంతో నిరాశలో పార్టీ నేతలు
- ప్రియాంకకు ప్రాతినిధ్యం పెంచాలన్న డిమాండ్ తెరపైకి
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలపాలంటే ప్రియాంకా గాంధీ అవసరం ఎంతైనా ఉందని కొందరు నేతలు చాలాకాలంగా అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన గుజరాత్, కర్ణాటక సహా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయం దూరమైన నేపథ్యంలో, ఆయన నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రియాంకను వెంటనే తీసుకురావాలన్న డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చారు.