కర్ణాటక బీజేపీదే అన్న ఆనందంలో దూసుకెళ్లిన సెన్సెక్స్!

15-05-2018 Tue 10:26 | Business
  • ఓ దశలో 420 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్
  • 36 వేల మార్క్ కు చేరువలో సూచిక
  • 115 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కర్ణాటకలో బీజేపీ ఆధిక్యంలో ఉందన్న వార్తలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకెళ్లాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వేళ, క్రితం ముగింపు వద్దే ఉన్న బెంచ్ మార్క్ సూచికలు, ఫలితాల సరళి బీజేపీకి అనుకూలంగా మారుతున్న సంకేతాలతో పాటే పైకి లేచాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఉత్సాహంగా నూతన కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 420 పాయింట్లకు పైగా లాభపడింది.

ఈ ఉదయం 10.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 417 పాయింట్ల లాభంతో 35,973 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 115 పాయింట్లు పెరిగి 10,921 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో 9 కంపెనీలు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, టైటాన్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఐఓసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.
KarnatakaBSENSEGainSensex

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more