ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశ్వాసాన్ని పునురుద్ధరించిన వైఎస్ జగన్: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశ్వాసాన్ని పునురుద్ధరించిన వైఎస్ జగన్: రోజా

  • ఆయన వెంట పాదయాత్రలో పాల్గొనడం నా హక్కు
  • ఆయన నాయకత్వం ఏపీని అగ్ర స్థానానికి తీసుకెళుతుంది
  • ట్విట్టర్లో రోజా పోస్టింగ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత రోజా సెల్వమణి అభినందించారు. పాదయాత్రలో ఆయన వెంట పాల్గొనడం ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. 2000 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేయడం ద్వారా జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నెలకొల్పారని పేర్కొన్నారు. ‘‘ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిలించారు. ఆయన నాయకత్వం కచ్చితంగా ఏపీని తిరిగి అగ్ర పథాన నిలబెడుతుంది’’ అని రోజా సెల్వమణి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 2,000 కిలోమీటర్లు నడిచిన జగన్ ప్రజల గుండెలను గెలిచారంటూ కొటేషన్ పెట్టారు. 
YSRCP
ya jagan
roja
padayatra

More Telugu News