సావిత్రిగారే కీర్తి సురేశ్ తో అలా చేయించారేమో!: ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రిగారే కీర్తి సురేశ్ తో అలా చేయించారేమో!: ఎన్టీఆర్

  • కీర్తి సురేశ్ నటన అద్భుతం 
  • నాకు మాటలు రావడంలేదు 
  • నాగ్ అశ్విన్ ప్రయోగం ఫలించింది  
సావిత్రిని ఎంతగానో అభిమానించే వాళ్లందరికీ 'మహానటి' సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సావిత్రి ఎందుకలా అనారోగ్యం పాలైంది? ఆమె మరణానికి చేరువ కావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటని ఇన్నాళ్లుగా అనుకుంటున్న చాలామందికి ఈ సినిమాతో సమాధానం దొరికింది.అలాంటి ఈ సినిమాను చూసిన సినీ ప్రముఖులు సైతం, కీర్తిసురేశ్ ను ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ సినిమా టీమ్ ను ప్రశంసిస్తున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. "సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. మంచి నటీనటులతో కలిసి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన గొప్ప ప్రయోగం ఫలించింది" అని అన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ కి ఆయన అభినందనలు తెలిపారు.  
keerti suresh
dulquer

More Telugu News