సావిత్రిలా కనిపించడం వేరు .. ఆమెలా నటించడం వేరు: కీర్తి సురేశ్ గురించి సాయిమాధవ్ బుర్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రిలా కనిపించడం వేరు .. ఆమెలా నటించడం వేరు: కీర్తి సురేశ్ గురించి సాయిమాధవ్ బుర్రా

  • సావిత్రి పాత్రకి కీర్తి సురేశ్ కరెక్ట్ గా సరిపోయింది 
  • కీర్తి సురేశ్ ను సెట్లో చూసి సావిత్రి గారు అనుకున్నాను 
  • సావిత్రిగారిలా ఆమె అద్భుతంగా చేసింది
 ఈ నెల 9వ తేదీన విడుదలైన 'మహానటి' అశేష ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాయడమే కాకుండా, 'పింగళి నాగేంద్రరావు'లా నటించారు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు."కీర్తి సురేశ్ మేకప్ వలన సావిత్రిలా అనిపించిందా? నిజంగానే సావిత్రి పోలికలు ఆమెకి ఉన్నాయా?" అనే ప్రశ్నకి ఆయన స్పందించారు. " కీర్తి సురేశ్ .. సావిత్రిలా కనిపించడం వెనుక మేకప్ పాత్ర కూడా కొంతవరకూ ఉంటుంది. కానీ మేకప్ వల్లనే అది కుదిరే పని కాదు. వేరే అమ్మాయిని తీసుకొచ్చి అదే మేకప్ వేయిస్తే సావిత్రిలా ఉంటుందా? ఉండదు .. కీర్తి సురేశ్ కనుకనే సరిపోయింది. నేను లొకేషన్లో 'మాయాబజార్ ' సెట్లో శశిరేఖ గెటప్ లో వున్న కీర్తి సురేశ్ ను సడన్ గా చూసి సావిత్రి గారు అనుకున్నాను. కీర్తి సురేశ్ .. సావిత్రిలా కనిపించడం వేరు .. ఆమెలా నటించడం వేరు" అంటూ చెప్పుకొచ్చారు. 
keerti suresh
dulquer

More Telugu News