కింద పడినా స్క్రీన్ చెక్కు చెదరదు..! ఇంటెక్స్ నుంచి అత్యాధునిక స్మార్ట్ ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కింద పడినా స్క్రీన్ చెక్కు చెదరదు..! ఇంటెక్స్ నుంచి అత్యాధునిక స్మార్ట్ ఫోన్

  • ధర రూ.5,999
  • ఏడాది వరకు స్క్రీన్ ఉచిత రీప్లేస్ మెంట్
  • 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ
స్మార్ట్ ఫోన్ కింద పడడం, స్క్రీన్ పగలడం సాధారణంగా జరిగేదే. స్మార్ట్ ఫోన్ కు ఉన్న పెద్ద సమస్యల్లా ఇదే. దీనికి పరిష్కారంగా దేశీయ కంపెనీ ఇంటెక్స్ కింద పడినా పగలని స్క్రీన్ తో ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. దీని ధర కూడా చాలా తక్కువే. కేవలం రూ.5,999. ఇంటెక్స్ స్టారి 10 అనే ఈ ఫోన్ స్నాప్ డీల్ లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఒకవేళ కింద పడి స్క్రీన్ పగిలినా ఫర్వాలేదని, ఏడాది వరకు స్క్రీన్ ను ఉచితంగా మార్చి ఇస్తామని హామీ ఇస్తోంది. 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5.2 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, వెనుక 13 మెగా పిక్సల్ కెమెరా, ముందు 5 మెగా పిక్సల్ కెమెరా, రెండు వైపులా ఎల్ఈడీ ఫ్లాష్, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 32జీబీ అంతర్గత స్టోరేజీ, 3జీ ర్యామ్ ఉన్నాయి. గ్లాసీ బ్లాక్, చాంపేన్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫోన్ పోతే ట్రాక్ చేయడం, యాంటీ వైరస్, సిమ్ మారిస్తే నోటిఫికేషన్ తరహా సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
intex smart phone

More Telugu News