పారిస్ లో ఫ్యామిలీతో షికారు చేస్తోన్న మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారిస్ లో ఫ్యామిలీతో షికారు చేస్తోన్న మహేశ్ బాబు

  • సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న మహేశ్ 
  • భార్యాబిడ్డలతో విదేశాల్లో షికారు 
  • తిరిగిరాగానే 25వ సినిమా మొదలు
మహేశ్ బాబు ఒక సినిమాకు ఓకే చెప్పాడు అంటే, తన కారణంగా ఒక్కరోజు కూడా షూటింగ్ ఆగకుండా చూస్తాడు. అనుకున్నట్టుగా షూటింగ్ జరగడానికి .. పూర్తి చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తాడు. షూటింగుకి బ్రేక్ ఇచ్చినా .. షూటింగ్ పూర్తయినా ఫ్యామిలీతో మహేశ్ బాబు విదేశాలకి వెళ్లిపోతుంటాడు. అక్కడ భార్యా బిడ్డలతో సరదాగా షికారు చేసేస్తుంటాడు.

అలా 'భరత్ అనే నేను' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఆ వెంటనే ఫ్యామిలీతో పారిస్ వెళ్లాడు. పారిస్ లోని అందమైన లొకేషన్స్ లో షికారు చేస్తున్నారు. అక్కడ వాళ్లు దిగిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూస్తుంటే ఈ సక్సెస్ ను మహేశ్ బాబు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నది తెలుస్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన 25వ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు.
Mahesh Babu
namrata

More Telugu News