లెనోవో నుంచి ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్... ధ్రువీకరించిన సంస్థ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లెనోవో నుంచి ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్... ధ్రువీకరించిన సంస్థ

  • బెజెల్స్ లేని కెమెరా
  • లెనోవో నుంచి ఈ తరహా తొలి ఫోన్
  • సంస్థ చివరి ఆవిష్కరణ లెనోవో కే8
చైనాకు చెందిన లెనెవో బెజెల్స్ ఫ్రీ ఫుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు అన్ని కంపెనీలు స్మార్ట్ ఫోన్లను అధిక స్క్రీన్ రేషియోతో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా చూసుకుంటే లెనోవో ఇంత వరకు ఒక్క ఫోన్ కూడా బెజెల్ లెస్ స్క్రీన్ తో తీసుకురాలేదు. దీంతో ఆలస్యంగానైనా సంస్థ అధిక స్క్రీన్ రేషియోతో ఉన్న ఫోన్ ను తీసుకువస్తోంది. ఈ విషయాన్ని లెనోవో గ్రూపు వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ ధ్రువీకరించారు.

ఇందుకు సంబంధించి వీబో అనే మైక్రో బ్లాగింగ్ సైట్ లో ఓ ఇమేజ్ కూడా పోస్ట్ చేశారు. దీనిపై ఎక్కడా నాచ్ లేకపోవడం ఆసక్తికరం. అంటే స్క్రీన్ మొత్తం చూసేందుకు అనువుగా ఉంటుందని తెలుస్తోంది. కెమెరా, బెజెల్స్, యాంటెన్నాలను తొలగించడం ద్వారా ఫోన్ బాడీలో స్క్రీన్ రేషియోను 95 శాతానికి తీసుకెళ్లడం సాధ్యమేనని చెంగ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. లెనోవో కే8 తర్వాత ఆ సంస్థ నుంచి ఇంత వరకు మరో స్మార్ట్ ఫోన్ రాలేదు.
lenovo full screen mobile

More Telugu News