Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ పరిశీలిస్తోన్న టైటిల్ ఇదేనా?

  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ను పూర్తిచేశారు. ఇంతకుముందు సినిమాల్లో ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ కి పూర్తి భిన్నమైన లుక్ లో ఆయన కనిపించనున్నాడు.

 ఫిట్ నెస్ తో కనిపించడం కోసం ఎన్టీఆర్ గట్టి కసరత్తులే చేస్తుండగా, మేకప్ పరంగా ఆయనని కొత్తగా చూపించడం కోసం హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ మేన్ ను రప్పించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పిన దగ్గర నుంచి, టైటిల్ ఎలా వుండనుందనే విషయంలో అంతా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో 'అసామాన్యుడు' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ పట్ల త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతున్నారట. ఇదే టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.          
ntr
pooja hegde

More Telugu News