ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదీన సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి నివేదికను రూపొందిస్తోంది. కాగా, మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చర్చించి ఈ నెల 14వ తేది మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.