తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకి మరో ముందడుగు
- స్థల పరిశీలనకు కేంద్ర సర్కారు కమిటీ
- కమిటీలో ఐదుగురు సభ్యులు
- కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ
నిర్ణీత పద్ధతుల్లో స్థల పరిశీలనకు ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం చూపించే స్థలాలను పరిశీలించి అనువైన స్థలాన్ని ఎంపిక చేయనుంది. దీంతో ఎయిమ్స్ ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వం తరపున జరగాల్సిన ప్రక్రియను కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.
కేంద్ర కమిటీలోని సభ్యులు
1. సునీల్ శర్మ, జాయింట్ సెక్రటరీ
2. డా.డీకే శర్మ, మెడికల్ సూపరింటెండెంట్, ఎయిమ్స్, ఢిల్లీ
3. సచిన్ మిట్టల్, డైరెక్టర్, పీఎంఎస్ఎస్వై
4. జీపీ శ్రీవాస్తవ, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎయిమ్స్, రాయబరేలి
5. ముకేశ్ వాజ్ పేయి, సీనియర్ ఆర్కిటెక్ట్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ