సావిత్రి చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో షాలిని పాండే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రి చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో షాలిని పాండే

  • ఈ నెల 9న 'మహానటి' విడుదల 
  • సావిత్రి బాల్యానికి సంబంధించి సుశీల ఒక తీపి జ్ఞాపకం  
  • స్టార్ హీరోయిన్ అయినా అదే స్నేహం 
సావిత్రి అభిమానులంతా 'మహానటి' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 9వ తేదీనే ఈ సినిమా విడుదల కానుండటంతో, అందరిలోనూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో షాలిని పాండే ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఏమైవుంటుందనే కుతూహలం అభిమానుల్లో ఉండేది.

సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే కనిపించనుందనేది తాజాగా రిలీజ్ చేసిన వీడియో వలన తెలుస్తోంది. సావిత్రి బాల్యానికి సంబంధించి సుశీల ఒక తీపి జ్ఞాపకమని చెబుతారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయిన తరువాత కూడా సుశీలతో అంతే ఆప్యాయంగా ఉండేవారట. సుశీలను చూడాలనిపించినప్పుడు తాను వెళ్లడమో .. ఆమెను రప్పించుకోవడమో చేసేవారట. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పాత్రలో షాలిని పాండే కనిపించనుందన్న మాట. 
shalini pandey

More Telugu News