యాపిల్ యూజర్లకు వాట్సాప్ బిజినెస్ యాప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాపిల్ యూజర్లకు వాట్సాప్ బిజినెస్ యాప్

  • అభివృద్ధి పనులు మొదలు
  • వాట్సాప్ గ్రీటింగ్ ఫీచర్ సైతం త్వరలో అందుబాటులోకి
  • వాబీటా ఇన్ఫో వెల్లడి
ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ బిజినెస్ యాప్ త్వరలో యాపిల్ యూజర్లకూ అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు మొదలయ్యాయి. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై ఇప్పటికే వాట్సాప్ బిజినెస్ యాప్ ను 30 లక్షల మంది వినియోగిస్తున్నారు. దీనికున్న డిమాండ్ దృష్ట్యా యాపిల్ ఐవోఎస్ యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ సిద్ధమైంది.

అయితే, కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తుందన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను సాధ్యమైనంత వేగంగా ఐవోఎస్ యూజర్లకూ తీసుకురావాలనుకుంటోంది. కొన్ని వారాలుగా ఐవోఎస్ వాట్సాప్ బిజినెస్ యాప్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు వాబీటాఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది. మరోవైపు గ్రీటింగ్ మెస్సేజ్ ఫీచర్ తీసుకొచ్చే పనులూ జరుగుతున్నట్టు తెలిపింది.
whatsapp business
ios
apple

More Telugu News