వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికే అది సాధ్యం ..ఇదిగో వీడియో!: హీరో నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికే అది సాధ్యం ..ఇదిగో వీడియో!: హీరో నాని

  • ‘మహానటి’లో ఎస్వీరంగారావు పాత్రలో మోహన్ బాబు
  • ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్
  • వాయిస్ ఓవర్ చెప్పిన హీరో నాని
నాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మహానటి’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ రోల్ ను కీర్తి సురేశ్ పోషించగా, సావిత్రి తల్లి పాత్రలో నటి దివ్యవాణి కనిపించనున్నారు. ఎల్వీ ప్రసాద్ గా నటుడు అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్, భానుమతిగా భానుప్రియ నటించారు. విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ ఈరోజు విడుదల చేసింది. హీరో నాని ఆ పాత్రను వీడియోలో పరిచయం చేశారు. 

‘పౌరాణికమైనా, సాంఘికమైనా..ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణనటుడు.. మన ఘటోత్కచుడంటే ఎస్వీ రంగారావుగారని ప్రతి తెలుగువాడు ఇట్టే చెప్పేస్తారు. ‘వివాహభోజనంబు వింతైన వంటకంబు’ అని అన్ని తెలుగు ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీఆర్ దే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందింది మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మన ముందుకు రాబోతున్నది ఎవరా అనుకుంటున్నారా? ఎస్.. మీ గెస్ కరెక్టే.. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికే అది సాధ్యం’ అని నాని పేర్కొన్నారు.

mahanati
mohan babu
hero nani

More Telugu News