ఆయేషా మీరా హత్య కేసు గురించి రోజా ఎందుకు మాట్లాడలేదు?: బుద్దా వెంకన్న

  • ఆయేషా మీరా హత్య కేసు గురించి రోజా ఎందుకు మాట్లాడలేదు?
  • విజయవాడలో రోజా అడుగుపెడితే మహిళలు అడ్డుకుంటారు
  • రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ సంచరిస్తోంది
వైసీపీపైన, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాపైన టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా, రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాచేపల్లి ఘటనపై స్పందించిన రోజా.. ఆయేషా మీరా హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

విజయవాడలో రోజా అడుగుపెడితే అడ్డుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ సంచరిస్తోందని, ఆ గ్యాంగ్ పట్టపగలు రోడ్లపై తిరిగి రాత్రికి దోచుకుపోతారని అన్నారు.  
Go Back to Shorts
YSRCP
buddha venkanna

More Telugu News