22 మందితో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై, అదుపుతప్పి లోయలోకి జరుగుతుండగా, ఓ భారీ వృక్షరాజం అడ్డుగా నిలిచి వారి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన గోచర్ సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ కు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో ఓ ట్రక్కును ఢీకొంది. ఆపై అదుపుతప్పి పక్కనే ఉన్న లోయవైపు దూసుకెళ్లి, ఓ చెట్టును ఢీకొని ఆగింది. బస్సులోని వారు స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ చెట్టే అడ్డుపడకుంటే, 90 అడుగుల లోయలోకి జారి తామందరి ప్రాణాలూ పోయేవని యాత్రికులు వ్యాఖ్యానించారు.