పెళ్లి కూతురిని ఆశ్చర్యంలో ముంచెత్తిన మహేశ్‌ బాబు.. ఫొటో వైరల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి కూతురిని ఆశ్చర్యంలో ముంచెత్తిన మహేశ్‌ బాబు.. ఫొటో వైరల్‌

  • పెళ్లి గ్రీటింగ్స్‌ పంపిన మహేశ్‌ బాబు
  • అందులో మహేశ్‌, నమ్రత సంతకాలు
  • హర్షం వ్యక్తం చేసిన పెళ్లికూతురు
ఓ పెళ్లి కూతురికి సినీనటుడు మహేశ్‌ బాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తనను ఎంతగానో అభిమానించే సురేఖ అనే వీరాభిమాని పెళ్లి జరుగుతోందని తెలుసుకున్న మహేశ్‌ బాబు ఆమెకు ఓ గ్రీటింగ్‌ కార్డును పంపించాడు. అందులో పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్‌ బాబుతో పాటు ఆయన భార్య నమ్రత కూడా సంతకం చేసింది. ఆ గ్రీటింగ్‌ కార్డును సురేఖ కుటుంబ సభ్యులకు మహేశ్‌ ఇటీవల పంపగా పెళ్లి వేడుక సందర్భంగా అందరి ముందూ ఆ గ్రీటింగ్‌ కార్డును పెళ్లి కూతురికి ఇచ్చారు.

దీంతో పెళ్లి కూతురు సురేఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్‌ బాబు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా భరత్‌ అనే నేను సినిమాతో విజయం అందుకున్న మహేశ్‌ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.
bride
Mahesh Babu
Bharath Ane Nenu

More Telugu News