సూర్య 24 గెటప్స్ తో అభిమాని వదిలిన వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్య 24 గెటప్స్ తో అభిమాని వదిలిన వీడియో

  • కోలీవుడ్ అగ్రహీరోగా సూర్య 
  • కొత్తదనానికే మొదటి ప్రాధాన్యత
  • విభిన్నమైన గెటప్స్ పట్ల ఆసక్తి
కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కోలీవుడ్ కథానాయకుల జాబితాలో సూర్య ముందుటాడు. సినిమా .. సినిమాకి తాను కొత్తగా కనిపించాలని, తన పాత్ర స్వభావం విభిన్నంగా ఉండాలని ఆయన భావిస్తుంటాడు. అందువల్లనే ఆయన ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ గెటప్స్ లో కనిపించాడు. 'గజిని' .. 'సింగం' .. '24' వంటి సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో సూర్య అభిమాని ఒకరు .. ఆయన గెటప్స్ ను పెన్సిల్ తో వేసి .. వాటిని ఒక వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు .. సూర్య గారూ, ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటా. ఈ వీడియోను రూపొందించడానికి నాకు వారం రోజులు పట్టింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి' అంటూ ట్వీట్ ద్వారా అభిమానులను కోరారు.   
surya

More Telugu News