'సూర్య' ప్రతాపం ఏమేరకు?.. బన్నీ సినిమాపై ప్రేక్షకుల మిశ్రమ స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూర్య' ప్రతాపం ఏమేరకు?.. బన్నీ సినిమాపై ప్రేక్షకుల మిశ్రమ స్పందన!

  • నేడు విడుదలైన నా పేరు సూర్య
  • అల్లు అర్జున్ నటన సూపరంటూ కామెంట్లు
  • సిల్లీ అటెంప్ట్ అని, పాటలే మైనస్ అని వ్యాఖ్యలు 
  • మొత్తం మీద మిశ్రమ స్పందన
నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' చిత్రానికి సినీ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అదరగొట్టినప్పటికీ, కొన్ని పాటలు చిత్రానికి మైనస్ అయ్యాయని, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువేనని ట్విట్టర్ వేదికగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్, అర్జున్ ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని అంటున్నారు. ఇక ఇదో సిల్లీ అటెంప్ట్ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. కథలో విషయం లేకపోయినా స్క్రీన్ ప్లే బాగుందని చెబుతున్నారు. ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయట. ఇక ఈ సమ్మర్ లో 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'తో టాలీవుడ్ సమ్మర్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అన్నది అతి త్వరలోనే తేలిపోతుంది.
Naa Peru Surya
Allu Arjun
New Movie
Tollywood

More Telugu News