విశాఖలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష... అనువైన స్థలం చూడాలంటూ ఆదేశం

  • ఈ నెల 20న విశాఖలో చంద్రబాబు దీక్ష
  • అనువైన స్థలాన్ని చూడాలంటూ మంత్రులకు చంద్రబాబు ఆదేశం
  • ఉత్సాహంలో విశాఖ టీడీపీ కార్యకర్తలు
విజయవాడ, తిరుపతిలలో ఇప్పటికే ధర్మ పోరాట దీక్షను చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు విశాఖపట్నంలో కూడా దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన దీక్షను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అనువైన స్థలాన్ని చూడాలని జిల్లా మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సముద్ర తీరంలో కానీ, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో కానీ ఏర్పాట్లు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరోవైపు విశాఖలో దీక్ష చేయాలని నిర్ణయించడంతో, నగరంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీక్ష ఏర్పాట్లలో పాల్గొనేందుకు పార్టీ కేడర్ ఉత్సుకత చూపుతోంది. ఈ దీక్ష ద్వారా ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్, కేంద్ర ప్రభుత్వ మోసం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు. 
Go Back to Shorts
Chandrababu
dharma porata deeksha
visakhapatnam

More Telugu News