'హెల్మెట్ పెట్టుకోను... మగాడిగా చస్తా' అని బైకుపై రాసుకున్న హైదరాబాదీకి ట్రాఫిక్ పోలీసుల స్వీట్ వార్నింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హెల్మెట్ పెట్టుకోను... మగాడిగా చస్తా' అని బైకుపై రాసుకున్న హైదరాబాదీకి ట్రాఫిక్ పోలీసుల స్వీట్ వార్నింగ్

  • నిబంధనలు ఉల్లంఘించిన కృష్ణారెడ్డి
  • ఫొటోలు తీసి పోస్టు చేసిన ట్రాఫిక్ పోలీసులు
  • చనిపోనివ్వబోమని స్వీట్ వార్నింగ్
ఇటీవల సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో పెట్టి, సున్నిత హెచ్చరికలు జారీ చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తన బైక్ వెనుక "నో హెల్మెట్... ఐ డై లైక్ రియల్ మెన్" (హెల్మెట్ పెట్టుకోను... నిజమైన మగాడిలా చస్తాను) అన్న స్టిక్కర్ వేసుకున్న కృష్ణారెడ్డి వాహనాన్ని ఫొటో తీసి, ఆ బైకుపై ఉన్న పెండింగ్ చలాన్ల స్క్రీన్ షాట్ సహా ట్విట్టర్ లో పెట్టారు. వాటితో పాటు, "కృష్ణారెడ్డి సర్, మీరు మమ్మల్ని క్షమించాలి. మేం మిమ్మల్ని చనిపోనివ్వం. నిజమైన మగాడిలా మీరు బ్రతికేలా మేం చేస్తాం" అని కామెంట్ పెడుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై 'దయచేసి హెల్మెట్ పెట్టుకుని బండి నడపండి' అని సలహా ఇచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Krishnareddy
Helmet
Hyderabad
Traphic Police

More Telugu News