విక్రమ్ కుమార్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ!
Add ap7am to your home Screen

విక్రమ్ కుమార్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ!

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'నా పేరు సూర్య'
  • అందుబాటులో లేని సుకుమార్ .. కొరటాల 
  • విక్రమ్ కుమార్ కథకి ఓకే
అల్లు అర్జున్ హీరోగా చేసిన 'నా పేరు సూర్య' ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. సుకుమార్ తో గానీ .. కొరటాలతో గాని తన నెక్స్ట్ మూవీ చేయాలని అల్లు అర్జున్ భావించాడు. కొరటాల ఇంకా కథ రెడీ చేసుకోలేదు .. అందుకు ఆయన చాలా సమయం తీసుకోనున్నాడు.

 ఇక సుకుమార్ విషయానికొస్తే ఆయన మహేశ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్ తో చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడట. నానితో సినిమా కేన్సిల్ కావడంతో విక్రమ్ కుమార్ .. అల్లు అర్జున్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. విక్రమ్ కుమార్ వినిపించిన కథ అల్లు అర్జున్ కి నచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.  
allu arjun
vikram kumar

More Telugu News