నిజంగా కీర్తి సురేష్‌లోకి సావిత్రి వచ్చారా? అన్నట్లు అనిపించింది!: సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • కీర్తి సురేష్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ చూశా
  • అద్భుతంగా అనిపించింది 
  • అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి కథ ఒకటి
అలనాటి నటీమణి సావిత్రి జీవితం ఆధారంగా ‘మహానటి’ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అద్భుతంగా చిత్రీకరించారని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు. కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మహానటి’ సినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరైన సీతారామశాస్త్రి మాట్లాడుతూ... ఈ సినిమాలో పాటలు రాసే క్రమంలో తాను ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటించిన వర్కింగ్‌ స్టిల్స్‌ చూశానని, నిజంగా సావిత్రి ఆమెలోకి వచ్చారా? అన్నట్లు అత్యద్భుతమైన అభినయం కనపడిందని అన్నారు.

సావిత్రి తరువాత ఆ స్థాయిలో ఇంకెవ్వరూ ఉండరని కొందరు అంటున్నారని, మరిప్పుడు కీర్తి సురేష్‌ ఉన్నారు కదా, ఎలా? అని అన్నారు. ఆమెను ఈ సినిమాలో అంతగా సావిత్రిలా మార్చేశారని అన్నారు. ఆ మాటలు విన్న కీర్తి సురేష్‌ ఆనందంలో మునిగిపోయారు. అత్యద్భుతమైన విజయగాథల్లో సావిత్రి కథ ఒకటని కొనియాడారు. 
Go Back to Shorts
mahanati
sirivennela
savithri
Hyderabad

More Telugu News