'నేల టిక్కెట్టు' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేల టిక్కెట్టు' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్?

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
  • రవితేజ జోడీగా మాళవిక శర్మ 
  • మే 24వ తేదీన భారీ రిలీజ్
తొలి రెండు సినిమాలతో భారీ విజయాలను అందుకున్న కల్యాణ్ కృష్ణ, తన మూడవ సినిమాగా 'నేల టిక్కెట్టు' సినిమాను రూపొందించాడు. రవితేజ .. మాళవిక శర్మ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారని చెప్పుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ విషయంగానీ .. ముఖ్య అతిథి విషయం గాని అధికారికంగా ఖరారు కాలేదని తాజాగా కల్యాణ్ కృష్ణ ట్వీట్ చేశాడు. మరి ఇదే విషయాన్ని అధికారికంగా చెబుతారో .. కొత్త నిర్ణయమేదైనా చెబుతారో చూడాలి. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. మాస్ టైటిల్ తో కూడిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందడం విశేషం.       
raviteja
malavika sharma

More Telugu News