హలో ట్యూన్స్ కోరుకునే వారి కోసం రూ.129కే ఎయిర్ టెల్ ప్లాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హలో ట్యూన్స్ కోరుకునే వారి కోసం రూ.129కే ఎయిర్ టెల్ ప్లాన్

  • వారం వ్యవధిలో రెండో ప్లాన్
  • అన్ లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 28 రోజులు వ్యాలిడిటీ
  • హలో ట్యూన్స్ అభిమానులకు ఇటీవలే రూ.219లో ఒక ప్లాన్
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్ హలో ట్యూన్స్ కోరుకునే వారి కోసం రూ.129తో కొత్త ప్లాన్ ను ప్రకటించింది. తమకు కాల్ చేసిన వారికి కాలర్ ట్యూన్లను వినిపించాలని ఆశించే వారి కోసం ఈ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇటీవలే రూ.219తోనూ ఈ కంపెనీ ప్లాన్ ను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.  రూ.129 ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటా, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు.

అయితే, కస్టమర్ కేర్ కు కాల్ చేసి విచారించిన తర్వాతనే రీచార్జ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రూ.129 రీచార్జ్ కు 220నిమిషాల లోకల్, ఎస్టీడీ నిమిషాల టాక్ టైమ్ ను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. కొత్త ప్యాక్ గురించి విచారించుకోకుండా రీచార్జ్ చేసుకుంటే వాయిస్ కాల్ ప్యాక్ మాత్రమే యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రూ.219 ప్లాన్ లో ఎయిర్ టెల్ ప్రతి రోజూ 1.4 జీబీ డేటాను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు కాలర్ ట్యూన్లను ఉచితంగా పొందొచ్చు. 
airtel
recharge plans

More Telugu News