జియోకు పోటీగా వొడాఫోన్ నుంచి రెండు అన్ లిమిటెడ్ ప్లాన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జియోకు పోటీగా వొడాఫోన్ నుంచి రెండు అన్ లిమిటెడ్ ప్లాన్లు

  • రూ.511, రూ.569 ప్రీపెయిడ్ ప్లాన్లు
  • వ్యాలిడిటీ 84 రోజులు
  • 2జీబీ, 3జీబీ డేటా ప్రతి రోజూ
వొడాఫోన్ జియోకు పోటీగా రెండు ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.511, రూ.569 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లు ఇవి. ఈ రెండు పథకాల్లోనూ వ్యాలిడిటీ 84 రోజులు. రూ.511తో రీచార్జ్ చేసుకుంటే, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

నెట్ వర్క్ అందుబాటును బట్టి ప్రతి రోజూ 2జీబీ 3జీ లేదా 4జీ డేటాలో దేన్ని అయినా పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ. అలాగే, రూ.569తో రీచార్జ్ చేసుకుంటే అన్ని కాల్స్ ఉచితంతోపాటు ప్రతి రోజూ 3జీబీ 3జీ లేదా 4జీ డేటా పొందొచ్చు. ఇందులోనూ రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితమే. వ్యాలిడిటీ 84 రోజులు. అయితే, ఎంపిక చేసిన కొన్ని సర్కిళ్లలోనే ఈ ప్లాన్లు అమల్లో ఉంటాయి.

vodafone

More Telugu News