వెరైటీగా 'టాక్సీవాలా' ప్రమోషన్ .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెరైటీగా 'టాక్సీవాలా' ప్రమోషన్ .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో!

  • విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
  • కథానాయికగా మాళవిక శర్మ  
  • ఈ నెల 18వ తేదీన భారీ రిలీజ్    
విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ విజయ్ దేవరకొండ ముందుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' అనే ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేశాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేసి .. అందులో భాగంగా 'డ్రీమ్ బిహైండ్ 'టాక్సీవాలా' పేరుతో ఒక వీడియోను వదిలారు.

'అర్జున్ రెడ్డి' తరువాత తన దగ్గర నాలుగు స్క్రిప్టులు ఉన్నాయనీ .. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక తాను సతమతమైపోతుంటే, ఓ నలుగురు ఆకతాయి పిల్లలు తన కలలోకి వచ్చారని విజయ్ దేవరకొండ చెప్పాడు. వాళ్లే 'టాక్సీవాలా' స్క్రిప్ట్ చేయమని చెప్పారనీ .. అందువల్లనే చేశానని అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతూ .. ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది.    
vijay devarakonda
malavika sharma

More Telugu News