నాకు తెలిసిన వాళ్లలో నీవే గ్రేట్.. లవ్ యూ!: అనుష్కకు కోహ్లీ గ్రీటింగ్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు తెలిసిన వాళ్లలో నీవే గ్రేట్.. లవ్ యూ!: అనుష్కకు కోహ్లీ గ్రీటింగ్స్

  • అనుష్క బర్త్ డేను సెలబ్రేట్ చేసిన కోహ్లీ
  • హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ట్వీట్
  • పెళ్లయిన తర్వాత అనుష్క తొలి పుట్టినరోజు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుతో ఆమె 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త జంట బర్త్ డే సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. కోహ్లీ సమక్షంలో కేక్ కట్ చేసింది అనుష్క. దీనికి సంబంధించిన ఫొటోలను కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

'హ్యాపీ బర్త్ డే మై లవ్. నాకు తెలిసిన వాళ్లలో అందరి కంటే ఎక్కువగా పాజిటివ్ గా, నిజాయతీగా ఉండే వ్యక్తివి నీవే. లవ్ యూ' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక అనుష్క జరుపుకున్న తొలి పుట్టిన రోజు ఇదే. 
Virat Kohli
Anushka Sharma

More Telugu News