ఊపిరి తీస్తున్న కాలుష్యం... రెండు కోట్ల మంది భారతీయులకు ఆస్తమా సమస్య
- నేడు ప్రపంచ ఆస్తమా దినం
- దేశంలో ఏటేటా పెరిగిపోతున్న బాధితులు
- చిన్నారుల్లో 15 శాతం మందికి సమస్య
ఆస్తమా గురించి కొన్ని విషయాలు
- ఇది అంటువ్యాధి కాదు. ఊపిరితిత్తుల్లో శ్వాస నాళాలకు సంబంధించిన సమస్య ఇది. ఇవి వాచిపోవడంతో శ్వాస నాళాల్లో వాయువు ప్రసారానికి అడ్డంకులు ఎదురవుతాయి.
- ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు 23 కోట్ల మంది ఉన్నారు.
- 2015లో ఆస్తమా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,83,000 మంది మరణించారు.
- అలెర్జీ కారకాలను పీల్చినప్పుడు వచ్చే సమస్య ఇది. ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్ ముఖ్యంగా కార్పెట్లు, పరుపు, దిండ్లలో ఉండే పురుగులు, బయట ఉండే వాయు కాలుష్యాలు, సిగరెట్ల పొగ, రసాయనాల వల్ల ఆస్తమా వస్తుంది.
- నివారణ చర్యలు, వైద్య చికిత్సలతో ఆస్తమా బారిన పడిన వారు కూడా హాయిగా జీవించడం సాధ్యమే.