త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన

  • రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పర్యటించనున్న చంద్రబాబు
  • ప్రతి జిల్లా నుంచి పోలవరం డ్యామ్ సైట్ కు బస్సులు నడపాలంటూ ఆదేశం
  • హక్కుల కోసం అందరూ పోరాడాలంటూ పిలుపు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనను చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. ఈ ఉదయం నీరు-ప్రగతి కార్యక్రమంపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఆగకూడదని చెప్పారు.

ఇదే సమయంలో తమ హక్కుల కోసం అందరూ పోరాడాలని తెలిపారు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం సరికాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని... ప్రతి జిల్లా నుంచి పోలవరం డ్యామ్ సైట్ కు బస్సులు నడపాలని సూచించారు. పాత్రికేయులు, విద్యార్థులు, రైతులకు డ్యామ్ పనులను చూపించాలని ఆదేశించారు. యావత్ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనా రాష్ట్రం కావాలని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
polavaram
state tour

More Telugu News