అప్పటి, ఇప్పటి ఫొటోలను పోస్ట్ చేసిన ఆర్జీవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పటి, ఇప్పటి ఫొటోలను పోస్ట్ చేసిన ఆర్జీవీ!

  • పైనున్న ఫొటోలో శివ సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌
  • కింది ఫొటోలో 'ఆఫీసర్స్‌' సహాయ దర్శకులు
  • విడుదలకు సిద్ధమవుతోన్న కొత్త సినిమా
దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా ట్విట్టర్‌లో రెండు ఫొటోలను పోస్ట్ చేసి గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. అందులో పై నున్న ఫొటోలో తనతో పాటు.. తాను దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా 'శివ'కు తన వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉండగా; కింది ఫొటోలో తాజాగా నాగార్జునతో చేస్తున్న 'ఆఫీసర్‌' సినిమాకు పని చేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నారు.

శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా గుణశేఖర్‌, కృష్ణవంశీ, తేజ, ఉత్తేజ్‌, ఫణి పనిచేశారు. రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆఫీసర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌గా మైరా సరీన్ నటిస్తోంది.
RGV
Twitter
photo

More Telugu News