ఎన్టీఆర్ మూవీలో రమ్యకృష్ణకి ఛాన్స్?
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ మూవీలో రమ్యకృష్ణకి ఛాన్స్?

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • ఆయన జోడీగా పూజా హెగ్డే
  • తొలి షెడ్యూల్ చిత్రీకరణ
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లోని సినిమా తొలి షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఒక కీలకమైన పాత్రను సీనియర్ హీరోయిన్ తో చేయిస్తుంటారు.

'అత్తారింటికి దారేది'లో నదియా .. 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలోనూ స్త్రీ ప్రాధాన్యత కలిగిన ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇటీవలే తమిళంలో సూర్య మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన రమ్యకృష్ణ, ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు'లో పవర్ఫుల్ రోల్ చేస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ ఎంపిక ఖరారైతే . . కచ్చితంగా అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణే అవుతుందని చెప్పొచ్చు.       
ntr
pooja hegde
ramyakrishna

More Telugu News