మీరు కౌరవులా? దేశం కోసం పనిచేస్తోన్న బీజేపీ వారు కౌరవులా?: సీపీఎంపై కిషన్‌రెడ్డి ఫైర్

  • బీజేపీ నేతలని కౌరవులతో పోల్చిన సీతారాం ఏచూరి
  • మండిపడ్డ కిషన్‌రెడ్డి
  • కులమతాల పేరుతో కూటములు కడుతున్నారని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిన్న జరిగిన సీపీఎం జాతీయ మహాసభల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బీజేపీ నేతలని కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. కౌరవులు తమకి బలం ఎక్కువగా ఉందనుకుంటున్నారని, కానీ పాండవులే చివరకు గెలుస్తారని ఆయన అన్నారు. సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

తమ పార్టీ దేశం కోసం జాతీయత భావంతో పనిచేస్తోందని, మరోవైపు వామపక్షాలు చిన్న చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తున్నాయని, అవినీతిపరులతో, కులమత, భాషల పేరుతో కూటములు కడుతున్నాయని, అటువంటప్పుడు మీరు కౌరవులా? బీజేపీ వారు కౌరవులా? అని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు ప్రజలు తిరస్కరిస్తోంటే మరోవైపు సీపీఎం తమని పాండవులని ఎలా అనుకుంటుందని వ్యాఖ్యానించారు. సీపీఎం కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ దివాళాకోరు తనానికి నిదర్శనమని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
BJP
kishan reddy
cpm

More Telugu News