Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అమ్మపై వేసిన ఒట్టు తీసి గట్టుమీద పెడుతున్నా: రామ్ గోపాల్ వర్మ

  • గంటలు గడవకుండానే మాట మార్చిన వర్మ
  • పవన్ ను పల్లెత్తు మాట అనబోనని ఒట్టు
  • తనపై ఇంకా ఆరోపణలు చేస్తున్నందున ఒట్టు తీసేశానని వెల్లడి
ఇకపై జన్మలో పవన్ కల్యాణ్ ను పల్లెత్తు మాట అననని చెబుతూ, తన కన్నతల్లిపై ఒట్టేసి ఈ మాట చెబుతున్నానని వ్యాఖ్యానించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గంటలు గడవకుండానే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన తల్లిపై వేసిన ఒట్టు తీసి గట్టుమీద పెడుతున్నానని, ఇందుకు ఆమె అనుమతి ఇచ్చిందని తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ పోస్టు పెట్టాడు.

 "నేను చేసిన పనికి సారీ చెప్పి, పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేశాను. ఆ తరువాత కూడా నేను... సీబీఎన్, లోకేశ్, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా మదర్ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను" అని చెప్పాడు. 
Pawan Kalyan
Ramgopal Varma
Tollywood

More Telugu News