తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర సర్కారు ఆమోదం

  • అవసరమైన స్థలాన్ని కేటాయించాలి
  • ప్రాజెక్టు నివేదిక రూపొందించాలి
  • రాష్ట్ర సర్కారుకి పలు సూచనలు
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోద ముద్ర వేసి, రాష్ట్ర సర్కారుకి పలు సూచనలు చేసింది. ఎయిమ్స్‌కు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని, అలాగే ఇందుకు సంబంధించి ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని పేర్కొంది.

కాగా, తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. పలుసార్లు ఇదే విషయంపై తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో తెలంగాణకు ఎయిమ్స్‌ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.
Go Back to Shorts
Telangana
BJP
aiims

More Telugu News