దీపికా పదుకొణె, క్రికెటర్ విరాట్ కోహ్లీలకు ప్రియాంకా చోప్రా శుభాకాంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపికా పదుకొణె, క్రికెటర్ విరాట్ కోహ్లీలకు ప్రియాంకా చోప్రా శుభాకాంక్షలు

  • టైమ్ 100 మంది ప్రభావిత వ్యక్తుల జాబితాలో వీరికి చోటు
  • దీనిపై ట్విట్టర్ వేదికగా అభినందనలు
  • దేశీ శక్తికి వీరు ప్రతీకలుగా అభివర్ణన
సహ నటీమణి, పద్మావత్ కథానాయిక దీపికా పదుకొణెకు మరో ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా శుభాకాంక్షలు తెలిపారు. టైమ్ 100 మంది ప్రపంచ ప్రభావిత వ్యక్తుల తాజా జాబితాలో దీపికా పదుకొణెకు చోటు లభించింది. దీంతో ప్రియాంకా చోప్రా ట్విట్టర్ లో స్పందించారు. ‘‘చాలా సంతోషం. నా స్నేహితులు దీపికా పదుకొణె, విరాట్ కోహ్లీలను టైమ్100 మంది జాబితాలో చూడడం చాలా గర్వంగా ఉంది. వీరికి శుభాభినందనలు. దేశీ శక్తి, ప్రాతినిధ్యానికి వీరు పూర్తి అర్హులు’’ అంటూ ప్రియాంకా చోప్రా ట్వీట్ చేశారు. 2016 సంవత్సరపు టైమ్ 100 మంది జాబితాలో ప్రియాంకా చోప్రా కూడా ఇదే విధంగా స్థానం సంపాదించుకుంది.
PRIYANKA CHOPRA
dipika
kohli

More Telugu News