ప్రత్యేక హోదాపై చర్చ.. హాజరుకానున్న రఘువీరా, బొత్స, రామకృష్ణ, ఉండవల్లి!

  • 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు-సాధనకు మార్గాలు' పేరిట చర్చ
  • ఈ నెల 20న విజయవాడలో సమావేశం
  • పాల్గొననున్న రాజకీయ నాయకులు, మేధావులు
కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు-సాధనకు మార్గాలు' అనే అంశంపై విస్తృత స్థాయిలో చర్చా గోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సమితి కన్వీనర్‌ కొలనుకొండ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడ గాంధీనగరలోని హోటల్‌ ఐలాపురం కన్వెన్షన్ హాల్‌ లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నరేంద్ర మోదీ సర్కారు చేస్తోన్న అన్యాయం, రాష్ట్ర పరిస్థితులపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక వేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌, రిటైర్డ్‌ ప్రభుత్వాధికారి ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు, మేధావులు పాల్గొననున్నారు.
Go Back to Shorts
Congress
YSRCP

More Telugu News