థ్రిల్లర్ నేపథ్యంలో నాని మూవీ .. దర్శకుడిగా విక్రమ్ కుమార్!
Add ap7am to your home Screen

థ్రిల్లర్ నేపథ్యంలో నాని మూవీ .. దర్శకుడిగా విక్రమ్ కుమార్!

  • నాగ్ తో నాని మల్టీ స్టారర్ 
  • నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ తో
  • కొత్త కాన్సెప్ట్ తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్          
రీసెంట్ గా 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల .. హను రాఘవపూడి .. అవసరాల శ్రీనివాస్ సినిమాలను వరుసగా చేయవలసి వుంది. అయితే ఈ ముగ్గురితో కంటే ముందుగా విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయాలని నాని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

 ఎప్పుడూ కూడా తాను హారర్ మూవీస్ చేయననీ .. సస్పెన్స్ థ్రిల్లర్స్ చేసే అవకాశం ఉందని గతంలో ఒక వేదికపై నాని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యం కలిగిన ఒక సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న మల్టీ స్టారర్ పూర్తికాగానే విక్రమ్ కుమార్ తోనే నాని సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  
nani
vikram kumar

More Telugu News