పాకిస్థాన్ దౌత్యవేత్తలపై కఠిన ఆంక్షలు విధించబోతున్న అమెరికా
- నియామక స్థానాల నుంచి 25 మైళ్ల దూరం మాత్రమే ప్రయాణించాలి
- అంతకు మించితే ముందుగానే అనుమతి తీసుకోవాలి
- వచ్చే నెల 1 నుంచి అమల్లోకి ఆంక్షలు
ఈ మేరకు వాషింగ్టన్ లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తోందని పేర్కొంది. డాన్ పత్రిక కథనం ప్రకారం... గత నెలలో ఈ నోటిఫికేషన్ పాక్ దౌత్య కార్యాలయానికి చేరింది. దీనిపై అమెరికా, పాక్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే, దీనిపై అటు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కానీ, ఇటు పాకిస్థానీ దౌత్య కార్యాలయం కానీ అధికారికంగా స్పందించలేదు.