నేను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: కమలహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: కమలహాసన్

  • అభిమాన సంఘాలను సమాజ సేవకు అనుగుణంగా మార్చాను
  • మూడు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లోకి వచ్చాను
  • ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానంతే
డబ్బు సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధినేత కమలహాసన్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి మూడు దశాబ్దాల క్రితమే వచ్చానని ఆయన చెప్పారు. అప్పట్లోనే తాను తన అభిమాన సంఘాలను సమాజ సేవకు అనుగుణంగా మార్చానని తెలిపారు. ఇప్పుడు నేరుగా ప్రజా సేవ చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టానని ఆయన తెలిపారు. అంతే తప్ప సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
Kamal Haasan
Makkal Needhi Mayyam
Tamilnadu

More Telugu News