150 కోట్ల మార్క్ కి చేరువలో 'రంగస్థలం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

150 కోట్ల మార్క్ కి చేరువలో 'రంగస్థలం'

  • ఎంతమాత్రం తగ్గని 'రంగస్థలం' జోరు
  • 100 కోట్ల షేర్ ను రాబట్టే ఛాన్స్ 
  • కొత్త రికార్డును సెట్ చేసే అవకాశం 
చాలాకాలంగా చరణ్ ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ 'రంగస్థలం' సినిమాతో పడింది. ఈ సినిమా హిట్ తో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో ఈ సినిమా 128 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 10 రోజులు పూర్తయ్యేనాటికి ఈ సినిమా 147.10 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇంతకుముందు 144.55 కోట్లను వసూలు చేసి రికార్డును సెట్ చేసిన 'శ్రీమంతుడు'ను అధిగమించింది.

 ఇక 150 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదని అంటున్నారు. 'బాహుబలి'ని పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా 'మగధీర' 150 కోట్లను .. 'ఖైదీ నంబర్ 150' 164 కోట్లను వసూలు చేశాయి. లైఫ్ టైమ్ రన్ లో ఈ రెండు రికార్డులను 'రంగస్థలం' అధిగమించే ఛాన్స్ ఉందనీ, 100 కోట్ల షేర్ ను వసూలు చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.  
charan
samanta

More Telugu News