ఆటోలో అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న పోలీస్‌ కానిస్టేబుల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆటోలో అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్న పోలీస్‌ కానిస్టేబుల్‌

  • హర్యానాలోని  రోహ్‌తక్‌లో ఘటన
  • కరాటే విద్య తెలిసిన అమ్మాయి
  • యువతితో అభ్యంతరకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్
  • చివరకు సస్పెండ్‌
ఆటోలో ఓ అమ్మాయిని వేధింపులకు గురి చేయాలని చూశాడు ఓ కానిస్టేబుల్‌. అయితే, ఆమెకు కరాటే వస్తుందని, ముట్టుకుంటే చితక్కొడుతుందని ఊహించలేకపోయాడు. చివరికి ఆమె చేతిలో తన్నులు తిని, సస్పెండ్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, హర్యానాలోని  రోహ్‌తక్‌లో జాతీయ స్థాయి కరాటే క్రీడాకారిణి అయిన 21ఏళ్ల యువతి కరాటే క్లాస్ ముగిశాక ఆటోలో ఇంటికి వెళుతోంది.

అదే ఆటో ఎక్కిన కానిస్టేబుల్ యాసిన్‌.. ఆమె పక్కన కూర్చొని ఫోన్‌ నంబరు ఇవ్వమని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని అన్నాడు. అనంతరం ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. దీంతో ఆ యువతి ఆ కానిస్టేబుల్‌పై తనకు తెలిసిన కరాటే విద్యను ప్రదర్శిస్తూ చితక్కొట్టింది. అనంతరం ఆ పోలీసుని అదే ఆటోలో మహిళా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది.

అయితే, అక్కడ యువతికి మరో సమస్య ఎదురైంది. అక్కడి మహిళా ఆఫీసర్‌ కేసు నమోదు చేయకుండా ఆ యువతికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం ఈ ఘటనను ఆమె రోహ్‌తక్‌ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సదరు మహిళా ఆఫీసర్‌ను బదిలీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
girl
Police
Haryana

More Telugu News