Sachin Tendulkar: అఫ్రిదీకీ ఘాటుగా సమాధానం ఇచ్చిన సచిన్ టెండూల్కర్
- సమర్థమైన నేతలు మనకు ఉన్నారు
- మనం ఏం చేయాలో బయటవాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు
- అఫ్రిదీ వ్యాఖ్యలకు సచిన్ ఘాటు స్పందన
కశ్మీర్ గురించి పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీమిండియా క్రికెటర్లు అఫ్రిదీని ఇప్పటికే ఓ ఆట ఆడేసుకున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అతని వ్యాఖ్యలపై స్పందించాడు. దేశాన్ని నడిపించడానికి సమర్థమైన నేతలు మనకు ఉన్నారని... మనం ఏం చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదని సచిన్ అన్నాడు.
ఇటీవల కశ్మీర్ లో 12 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనపై అఫ్రిదీ స్పందిస్తూ, కశ్మీర్ ప్రజలపై అణచివేత తీవ్రంగా ఉందని అన్నాడు. కశ్మీర్ లో రక్తం ఏరులై పారుతున్నా, ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో, అఫ్రిదీపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.