జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో సినీ నటి టబుకి చేదు అనుభవం!

  • కృష్ణ జింకను వేటాడిన కేసు విషయంలో కోర్టుకు టబు
  • నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు 
  • జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని
ప్రముఖ సినీ నటి టబుకు జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన కేసు విషయంలో ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంఘటనలో సల్మాన్ తో పాటు ఉన్నందుకు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబులు కూడా నిందితులుగా కేసును ఎదుర్కున్నారు.

 కోర్టు నేడు తీర్పు వెలువరించనున్న క్రమంలో కోర్టుకు హాజరు కావడానికి టబు జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరగా, ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడ ఉన్న బౌన్సర్లు అతన్ని పక్కకు లాగిపడేశారు. దీంతో టబు చాలా ఇబ్బంది పడ్డారని, దీనిపై కేసుపెట్టే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Bollywood
actress
tabu
jodhpur
air port

More Telugu News