చరణ్ .. సుకుమార్ లకు హ్యాట్సాఫ్: వెంకటేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరణ్ .. సుకుమార్ లకు హ్యాట్సాఫ్: వెంకటేశ్

  • దూసుకుపోతోన్న 'రంగస్థలం' 
  • వెల్లువెత్తుతోన్న అభినందనలు 
  • అభిమానుల్లో సంబరం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'రంగస్థలం' సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ ఈ సినిమా దూసుకుపోతుండటంతో, మెగా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సుకుమార్ .. చరణ్ లను ప్రశంసిస్తున్నారు.

ఇప్పటికే పవన్ కల్యాణ్ .. ఎన్టీఆర్ .. రానా తదితరులు ఈ సినిమా టీమ్ ను అభినందించారు. తాజాగా ఈ జాబితాలో వెంకటేశ్ కూడా చేరిపోయారు. "రంగస్థలం' చూశాను ..  'చిట్టిబాబు'గా చరణ్ నటన మచ్చలేని విధంగా వుంది. ప్రతి పాత్రను సుకుమార్ చాలా అద్భుతంగా మలిచాడు. ఆయన దర్శక ప్రతిభకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపించారు. సుకుమార్ .. చరణ్ .. సమంత ఈ ముగ్గురూ తమ కెరియర్లోనే ఇంతటి వేగవంతమైన సక్సెస్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సాహంతో తరువాత సినిమాలపై దృష్టి పెడుతున్నారు.          
charan
samantha

More Telugu News