మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి పద్మారావు
- మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందానికి ఘనస్వాగతం
- స్టేడియం తీరుతెన్నులను పరిశీలించిన బృందం
- తెలంగాణాని కూడా క్రీడల పరంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి
అనంతరం, పద్మారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్రాన్ని కూడా క్రీడల పరంగా అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని అన్నారు. మంత్రి వెంట ఉన్న ఉన్నత స్థాయి బృందంలో తెలంగాణా క్రీడల ప్రాధికారత సంస్థ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశం, మంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ ఎస్.ఎం.రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.