అల్లు అయాన్ తో కేక్ కట్ చేయించిన బన్నీ దంపతులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అయాన్ తో కేక్ కట్ చేయించిన బన్నీ దంపతులు

  • అల్లు అయాన్ బర్త్ డే ఈ రోజు 
  • ఇంట్లోనే కేక్ కటింగ్ 
  • బన్నీ బిజీగా ఉండటమే కారణం  
అల్లు అర్జున్ దంపతులు .. తమ తనయుడు అయాన్ కి సంబంధించిన సరదా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ, అభిమానులను మురిపిస్తూ ఉంటారు. అయాన్ ఫస్టు బర్త్ డే నుంచి ప్రతిసారి ఆ వేడుకకి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ వచ్చారు. అలా ఈ రోజు కూడా అయాన్ బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అల్లు అయాన్ 2014 .. ఏప్రిల్ 3వ తేదీన జన్మించిన సంగతి తెలిసిందే. గతంలో అల్లు అయాన్ పుట్టినరోజు వేడుకలను ఈ దంపతులు దుబాయ్ .. గోవాల్లో జరిపారు. ఈ సారి 'నా పేరు సూర్య' సినిమా పనుల్లో అల్లు అర్జున్ బిజీగా ఉండటం వలన, కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. అల్లు అర్జున్ దంపతులు మొదటి నుంచి కూడా అయాన్ ను అభిమానులకి చేరువలోనే ఉంచుతూ వచ్చారు. అందువలన అయాన్ ను వాళ్లంతా ఎంతగానో అభిమానిస్తూ వుంటారు. వాళ్లంతా కూడా అయాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.   
allu arjun
ayaan

More Telugu News