రామోజీ రావు గారు.. మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు!: నటి శ్రీ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామోజీ రావు గారు.. మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు!: నటి శ్రీ రెడ్డి

  • రామోజీ సర్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి
  • మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో తెలియదు
  • అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేని అనిల్ లాంటి వారిని నిర్మూలించాలి  
కొంతకాలంగా తెలుగు సినీ, టీవీ రంగాలలోని పలు దిగ్భ్రాంతికర విషయాలను బయటపెడుతున్న శ్రీరెడ్డి తాజాగా రామోజీ గ్రూపు ఆధ్వర్యంలోని ఈటీవీ గ్రూపుపై కూడా ఆరోపణలు చేసింది. 'రామోజీ రావు గారు.. మీరు ఈటీవీకి నైతిక విలువలు, క్రమశిక్షణ బాగా మెయింటైన్ చేస్తారు, మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పురుగుల్ని మీ కాంపౌండ్ లో లేకుండా చేద్దురుగాని..

మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో తెలియదు... ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈటీవీ కోసం కార్యక్రమాలను రూపొందిస్తూన్న అనిల్ అనే వ్యక్తికి అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. తనకున్న పవర్ తో వెబ్ ఛానల్ లో వచ్చిన వీడియోస్ ని బలవంతంగా తెప్పిస్తున్న ఇలాంటి వాళ్లని వెంటనే నిర్మూలించాలి' అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
srireddy
srireddyleaks
ramojirao
etv

More Telugu News